హైదరాబాద్: గచ్చిబౌలి పరిధిలోని నానక్‌రామ్‌గూడలో లిఫ్ట్ మరమ్మతు పనులు చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ టెక్నీషియన్ ప్రాణాలు కోల్పోగా, మరో టెక్నీషియన్ తీవ్రంగా గాయపడ్డాడు.
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని నానక్‌రామ్‌గూడ SAS భవనంలో నవంబర్ 19న ఉదయం ఈ ప్రమాదం జరిగింది. భవనంలోని రెండో అంతస్తులో ఇద్దరు టెక్నీషియన్లు లిఫ్ట్ మరమ్మతు పనులు చేస్తుండగా, లిఫ్ట్ అకస్మాత్తుగా పైకి కదిలింది. దీంతో లిఫ్ట్‌లో ఇద్దరూ ఇరుక్కుపోయి తీవ్ర ప్రమాదానికి గురయ్యారు.
ఈ ఘటనలో టెక్నీషియన్ రంగోళ్ల మనోహర్ మృతి చెందగా, మరో టెక్నీషియన్ అల్లూరి వాసు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వాసును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై రంగోళ్ల వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
